- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబ్బులు తీసుకుని చిందులేసిన స్టార్ నటి.. సిగ్గుండాలంటున్న నెటిజన్లు
దిశ, సినిమా: పాకిస్థానీ ప్రముఖ నటి, గాయని, యూట్యూబర్ అయేషా ఒమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఫ్రెండ్ పెళ్లి లో ఆమె చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. సదరు వీడియోలో అయేషా ‘మున్నీ బద్నామ్ హుయే’ బాలీవుడ్ సాంగ్‌కు డ్యాన్స్ చేస్తుండగా.. పక్కన ఉన్న అబ్బాయిలు తనను భుజాలపై ఎత్తుకుని స్టెప్పులేశారు. ఈ ఇన్సిడెంట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు.. ఓ సెలబ్రిటీ ఇలా ప్రవర్తించడమేంటి? ఎందుకు చిల్లర వేషాలు వేస్తున్నావ్? కొంచెమైనా సిగ్గుండాలి. పెళ్లి లో డ్యాన్స్ చేయడానికి ఎంత తీసుకున్నావ్? అంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఈ ట్రోల్స్‌పై స్పందించిన నటి.. ‘మేము ఎక్కడపడితే అక్కడ చిందులెయ్యం. బంధువులు, క్లోజ్ ఫ్రెండ్స్ వివాహ వేడుకల్లో యాదృచ్ఛికంగా అలా జరిగిపోతుంది. అయినా సెలబ్రిటీలు సాధారణ జీవితం గడపకూడదని రూల్ ఉందా? ఒకటి గుర్తుపెట్టుకోండి అబ్బాయిలు.. ఆత్మ శాంతి కోసం సన్నిహితులతో కలిసి డ్యాన్స్ చేస్తాం. అంతేగాని డబ్బు కోసం కాదని గ్రహించాలి’ అంటూ క్లాస్ పీకింది. ‘డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నపుడు ఎడమ పాదంలో గాజు ముక్క ఇరుక్కుపోయింది. కానీ యంగర్ బ్రదర్స్ బలవంతం చేయడంతో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అందుకే నన్ను ఎత్తుకున్నారు’ అని క్లారిటీ ఇచ్చింది. ఇక అయేషా ‘జిందగీ గుల్జార్ హై’, ‘కరాచీ సే లాహోర్’, ‘కాఫ్ కంగనా’ వంటి చిత్రాలతో ప్రజాదరణ పొందింది.
- Tags
- Ayesha Omar