- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్ న్యూస్.. అద్దెకు ప్రధానమంత్రి అధికారిక నివాసం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు అనేక ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ దేశ ప్రధాని నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ మీడియా వెల్లడించింది. కాగా ఇస్లామాబాద్‌లోని ప్రధాని నివాసాన్ని ఉన్నత విద్యాసంస్థగా మార్చాలని అధికార పీటీఐ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు పీఎం ఇమ్రాన్ ఖాన్ తన నివాసాన్ని 2019లో ఖాళీ చేశాడు. తాజాగా ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకున్నట్టు పాక్ మీడియా తెలిపింది. తాజా నిర్ణయం ప్రకారం ప్రధాని నివాసాన్ని అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది. దీన్ని కల్చరల్, ఫ్యాషన్, ఎడ్యుకేషనల్, ఇతర ఈవెంట్లను నిర్వహించాలనుకునేవారికి అద్దెకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపింది. దీని కోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రధాని నివాసం ఔచిత్యానికి భంగం కలగకుండా చూసుకునే విధిని ఆ రెండు కమిటీలకు అప్పగించనున్నట్టు తెలిపింది.