పాకిస్తాన్‌కి 'మేడిన్ ఇండియా' కరోనా వ్యాక్సిన్లు

by vinod kumar |   ( Updated:2021-03-09 21:28:05.0  )
పాకిస్తాన్‌కి మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: శత్రు దేశమైన పాకిస్తాన్‌కి భారత్ పరోక్షంగా సహాయపడుతోంది. ఇతర దేశాలకు కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్న తరహాలోనే పాకిస్తాన్‌కి కూడా కరోనా వ్యాక్సిన్ల పంపిణీలో సహాయపడనుంది. యునైటెడ్ గావీ కూటమి కింద ఇస్లామాబాద్‌కి త్వరలో 45 మిలియన్ల మేడిన్ ఇండియా వ్యాక్సిన్ డోస్‌లు చేరనున్నాయి. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ సర్వీసెస్, రెగ్యూలేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫెడరల్ సెక్రటరీ అష్రఫ్ ఖవాజా పాకిస్తాన్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి తెలిపారు.

గావీ కూటమి ప్రపంచంలోని సగం మంది పిల్లలకు ప్రాణాంతక వ్యాధులకు టీకాలు వేయడంలో సహాయపడుతోంది. ప్రస్తుత కరోనా సమయంలో ఈ కూటమి పాకిస్తాన్‌కి సహాయం అందిస్తోంది. అందులో భాగంగా కరోనా వ్యాక్సిన్లు అందించేందుకు గత ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్‌కి గావీ కూటమి మొత్తం 45 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు అందించనుండగా.. 16 మిలియన్ల డోస్‌లు ఈ ఏడాది జూన్‌లోపు అందించనుంది.

సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కరోనా వ్యాక్సిన్లను పాకిస్తాన్‌కు భారత్ పంపనుంది. సంక్షోభ సమయంలో శతృత్వాన్ని వదిలేసి పాక్‌కి భారత్ ఇలా పరోక్షంగా సహాయపడటంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed