- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్‌పై భారత్ ఆగ్రహం
న్యూఢిల్లీ: పీవోకేలో పాకిస్తాన్ దయమెర్-భాషా డ్యామ్ నిర్మించడంపై భారత్ ఆగ్రహించింది. భారత సరిహద్దుల్లో రకరకాల మార్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలను ఖండించింది. గిల్గిత్-బాల్టిస్తాన్‌లో చిలాస్‌లోని ఈ డ్యామ్ నిర్మాణానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ప్రారంభించారు. భారత నిరసనలను ఖాతరు చేయకుండా చైనా ప్రభుత్వ కంపెనీ భాగస్వామ్యమున్న ఈ మెగా ప్రాజెక్టును నిర్మించడానికే పాకిస్తాన్ మొగ్గుచూపింది. దీనిపై భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కేంద్రపాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు నిస్సందేహంగా భారత్ అంతర్భాగాలేనని, ఈ డ్యామ్ ప్రాజెక్టుపై పాకిస్తాన్ ప్రభుత్వానికి భారత నిరసనను తెలిపామని వివరించారు. ఈ డ్యామ్ నిర్మిస్తే ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని చాలా భాగాలు డ్యామ్ నీటి కింద మునిగిపోయే ప్రమాదమున్నదని తెలిపారు. ఇటువంటి అక్రమ స్వాధీన కుట్రలను సహించేది లేదని స్పష్టం చేశారు.