తాలిబాన్ నాయకుడికి ముద్దులు పెట్టిన పాకిస్తాన్ జర్నలిస్టు.. ఇది వేరే టైప్ ‘బ్రొమాన్స్’ ..!

by Anukaran |   ( Updated:2021-12-16 12:07:33.0  )
తాలిబాన్ నాయకుడికి ముద్దులు పెట్టిన పాకిస్తాన్ జర్నలిస్టు.. ఇది వేరే టైప్ ‘బ్రొమాన్స్’ ..!
X

దిశ, వెబ్‌డెస్క్ : దాయాది దేశం పాకిస్తాన్‌ అనగానే ప్రపంచవ్యా్ప్తంగా అందరికీ గుర్తొచ్చేది ‘టెర్రరిజం’.. ఉగ్రవాదులకు పాక్ పుట్టినిల్లు వంటిదని అంతర్జాతీయ వేదికల మీద భారత్ ఎన్నోమార్లు స్పష్టం చేసింది. అమెరికా ట్విన్ టవర్స్ కూల్చిన బిన్ లాడెన్ నుంచి ఇండియాలో జరిగిన మేజర్ టెర్రర్ అటాక్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రదాడులలో తప్పకుండా పాక్ బేస్‌గా ట్రెయినింగ్ పొందిన ఉగ్రవాదులుంటారని అంతర్జాతీయ నిఘా సంస్థలు చెబుతున్నాయి. అయితే, ఉగ్రవాదులను పట్టుకునేందుకు అగ్రదేశాలతో పాటు అభివృద్ధి చెందిన కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కానీ పాక్‌లో ఉండే జర్నలిస్టులు వారిని సులువుగా కలిసి ఇంటర్వర్యూలు చేస్తుంటారు. ప్రపంచానికి మెసేజెస్ పంపుతుంటారు.

ఎందుకంటే వారంతా అక్కడ సాధారణ ప్రజల లాగా తిరుగుతుంటారని కొందరు మాజీ ఆర్మీ అధికారులు పేర్కొన్న ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా ‘జామిల్ ఫారూఖీ’ పాక్ జర్నలిస్టు ఓ వీడియో క్లిప్‌ను షేర్ చేశాడు. అందులో అతను తాలిబన్ స్పో్క్స్ పర్సన్ ‘సుహెల్ షాహీన్‌’తో వీడియో కాల్‌లో సంభాషించాడు. పాక్ జర్నలిస్టు తాలిబాన్ నాయకుడితో సంభాషణ పూర్తయ్యాక ఇరువురు ఫ్లైయింగ్ కిసెస్ ఇచ్చుకున్నారు. చివరగా జర్నలిస్టు ఫారూఖీ మాట్లాడుతూ..‘షాహీన్ బాయ్ బహుత్ బహుత్ షుకిరియా’ ( షాహీన్ అన్నగారు.. మీకు చాలా చాలా ధన్యావాదాలు) అంటూ ముగించాడు. ఈ వీడియోను పాక్ జర్నలిస్టు ఆన్లైన్‌లో పోస్టు చేయగా తెగ వైరల్ అయ్యింది. వీరిద్దరి సంభాషణ మరియు గాల్లో ముద్దులు ఇచ్చుకునే సందర్భంపై స్పందించిన నెటిజన్లు దీనికి ‘బ్రొమాన్స్’ అని పేరు పెట్టారు.

Advertisement

Next Story

Most Viewed