- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాక్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్.. ఇండియాపై గెలిస్తే వారి దశ తిరిగినట్టే..!
దిశ, వెబ్‌డెస్క్ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన ప్రకటన చేసింది. ఈనెల 17న టీ20 ప్రపంచ కప్ ప్రారంభమవుతున్న వేళ పాక్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అక్టోబర్ -24న జరిగే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచులో గెలిస్తే ఆటగాళ్లకు ‘బ్లాంక్ చెక్’ ఇవ్వనున్నట్టు పీసీబీ బోర్డు చైర్మన్ రమీజ్ రజా స్పష్టంచేశారు. పీసీబీని బలోపేతం చేసేందుకు దొరికిన ఓ భారీ ఇన్వెస్టర్ సూచనతో ఈ ప్రకటన చేస్తున్నట్టు తాజాగా నిర్వహించిన బోర్డు మీటింగ్‌లో ఆయన ప్రకటించారు. ఇదిలాఉండగా, ఐసీసీ ఇస్తున్న 50 శాతం నిధులతోనే ప్రస్తుతం పీసీబీ బోర్డు నడుస్తోంది.
కాగా, ఐసీసీకి 90 శాతం నిధులు బీసీసీఐ నుంచి అందుతున్న విషయం తెలిసిందే. ఒకవేళ బీసీసీఐ నిధులు ఇవ్వడం ఆపేస్తే అటు ఐసీసీ, పీసీబీ బోర్డు కుప్పకూలే ప్రమాదముందని వెల్లడించారు. పీసీబీ బోర్డు చైర్మన్ ప్రకటనతో పాక్ క్రికెటర్లు ఎలాగైనా ఈ మ్యా్చ్‌లో గెలవాలని ఉవ్విళ్లురుతూ ఉండగా, ఎన్నో ఏళ్లుగా దాయాది జట్టుతో మ్యాచ్‌లకు దూరంగా ఉన్న టీం ఇండియా సైతం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ అనగానే ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు పూనకం వచ్చేస్తుంటుంది. కేవలం ఇండియా, పాక్‌లోనే కాకుండా ఈ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.
- Tags
- international