- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్తాన్ కు భారత్ కరోనా వ్యాక్సిన్.. త్వరలో పంపిణీ..?!
దిశ,వెబ్‌డెస్క్ : భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్ ను బంగ్లాదేశ్ కు పంపించేందుకు కేంద్రం సర్వం సిద్ధం చేసింది. భారత్ – బంగ్లాదేశ్ ద్వైపాక్షిక ఒప్పందం లో భాగంగా కేంద్రం మన దేశానికి చెందిన సీరం ఇండియా సారథ్యంలో ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రాజెనెకా సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను జనవరి 20న బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు 20లక్షల డోస్ లను పంపనుంది.
ఈ నేపథ్యంలో భారత్ కు చెందిన కరోనా వ్యాక్సిన్ కోవీషీల్డ్ తమదేశానికి వస్తున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఆ వ్యాక్సిన్ ను ఢాకాలోని ఇండియన్ హై కమిషన్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ భారత్ నుంచి వచ్చిన కరోనా వ్యాక్సిన్ ను తీసుకోనున్నట్లు ఆదేశానికి చెందిన ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా బంగ్లాదేశ్ లో 5లక్షల మందికి కరోనా సోకగా అందులో 7,900మంది వైరస్ కారణంగా మరణించారు.
మరోవైపు భారత్ కు చెందిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ సైతం అత్యవసర పరిస్థితుల కింద వినియోగించుకోవచ్చని పాక్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ పాకిస్తాన్ (డీఆర్ఎపీ) అనుమతిచ్చింది. కాగా పాక్ లో 5లక్షల మందికి కరోనా సోకగా 11,000 మంది వైరస్ కారణంగా మరణించారు. అంతేకాదు త్వరలో కోవీషీల్డ్ టీకా సైతం పాక్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఉచితంగా అందించనుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు డబ్ల్యూహెచ్ఓ భారత్ కు చెందిన సీరం ఇండియాతో ఒప్పొందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందంలో భాగంగా COVAX పేరుతో డబ్ల్యూహెచ్ఓ నాలుగు పిల్లర్లుగా విభజించింది. ఈ COVAX అర్హత కలిగిన 190 దేశాలకు ఒక్కో దేశానికి 20శాతం మేర 2021 మొదటి అర్ధభాగంలో దాదాపు 2 బిలియన్ డోసుల వాక్సిన్ టీకాలను అందించేందుకు సిద్ధమైంది. మరోవైపు Gavi COVAX AMC కింద 92 అర్హతగల ఆర్థిక వ్యవస్థలకు కనీసం 1.3 బిలియన్ వాక్సిన్ డోసులను అందించాలని Gavi లక్ష్యంగా పెట్టుకుంది. డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్‌ను పంపిణీ చేసే 192 దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. ఈ వ్యాక్సిన్ ఏప్రిల్ – జూన్ నెలలో పాక్ కు అందనుంది.
అయితే డబ్ల్యూహెచ్ఓ అందించే కోవీషీల్డ్ దేశ మొత్తం జనాభాలో 20 శాతం మందికే సరిపోతుంది. మిగిలిన జనాభాకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ ను ధ్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా భారత్ తో సంప్రదింపులు జరిపి, ఆ వ్యాక్సిన్ ను దేశ ప్రజలకు అందించాలనే ప్లాన్ లో ఉంది పాకిస్తాన్ . నేషనల్ మీడియా ఇండియన్ ఎక్స్ ప్రెస్ సైతం ఇప్పటికే భారత్ లో తయారైన ఓ వ్యాక్సిన్ పాక్ చేరినట్లు కథనంలో ప్రస్తావించింది.
2019 పుల్వామా దాడి తరువాత భారత్ – పాక్ దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు దెబ్బతిన్నాయి. మరి ఇప్పుడు భారత్ కరోనా వ్యాక్సిన్ ను పాకిస్తాన్ కు పంపిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. హస్తిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ ప్రభుత్వం తమకు వ్యాక్సిన్ కావాలంటూ కేంద్రాన్ని సంప్రదించలేదని తెలుస్తోంది.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, పాక్ ఆరోగ్యశాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ సూచనలతో డ్రగ్ రెగ్యులేరటరీ అథారటీ ఆఫ్ పాకిస్తాన్ (డీఆర్ఎపీ) కోవీషీల్డ్ అత్యవసర వినియోగానికి అనుమతిచ్చినట్లు, ఆ వ్యాక్సిన్ ప్రజలకు ఉచితంగా అందించేలా ప్రకటన చేసినట్లు పాక్ మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. మరి రాబోయే రోజుల్లో భారత్ లో తయారైన కరోనా వ్యాక్సిన్ ను కేంద్రం పాక్‌కు అందిస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.