LOC వద్ద అక్రమ చొరబాటు.. పాక్ పౌరుడు అరెస్ట్

by Shamantha N |
LOC వద్ద అక్రమ చొరబాటు.. పాక్ పౌరుడు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజోరీ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు తెలిపారు. గత నాలుగు రోజుల్లో ఇది రెండో అరెస్ట్ అని అధికారి గుర్తుచేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లోని నాయకల్ గ్రామానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ (28) అనే చొరబాటుదారుడిని ఈ నెల 15న భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎల్‌వోసీ గుండా పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ అతడు పట్టుబడ్డట్లు ఆర్మీ అధికారి తెలపారు.

Advertisement

Next Story