- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాణం తీసిన వర్షం.. రేకుల షెడ్డుపై కర్రలు పడి పెయింటర్ మృతి..
దిశ, పటాన్‌చెరు: వర్షం, గాలి దుమారం రావడంతో ఓ రేకుల షెడ్డులో తల దాచుకునేందుకు వెళ్లిన పెయింటర్లపై పక్కనే ఉన్న సర్వే కర్రలు పడి ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ రామానాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రాంజల్ హజారికా(25), ఎల్ బుధ చంద్ర సింహ (38) ఇద్దరు కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్ వచ్చి.. పాశమైలారంలో ఉంటూ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నారు.
మంగళవారం రుద్రారం గ్రామంలో పెయింటింగ్ వేసేందుకు వెళ్లి తిరిగి సాయంత్రం పని ముగించుకుని పాశమైలారం బయలుదేరగా, ఇస్నాపూర్ వద్దకు రాగానే ఇంతలో వర్షం పడింది. దీంతో రోడ్డు ప్రక్కన ఉన్న ఒక షెడ్డులోకి వెళ్లారు. గాలికి షెడ్డు పక్కన నిలబెట్టిన సర్వే కర్రలు షెడ్ మీదపడటంతో ప్రాంజల్ హజారికాకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. బుధచంద్ర సింహకి కాలు విరిగింది. షాపు యజమాని మేదర శంకరయ్యకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
- Tags
- dies