ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి

by Anukaran |   ( Updated:2020-10-13 22:31:56.0  )
ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు మృతి
X

దిశ, వెబ్‎డెస్క్: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ శోభానాయుడు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‎లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శోభానాయుడు మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శోభానాయుడు 1956లో జన్మించారు. వెంపటి చిన సత్యం వద్ద శిష్యరికం చేసిన ఆమె.. చిన్ననాటి నుంచే నృత్య ప్రదర్శనలు చేయడం ప్రారంభించారు. నాట్య ప్రదర్శనల్లో తన ప్రతిభను చాటి రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలెన్నో అందుకున్నారు. హైదరాబాద్‌లో కూచిపూడి ఆర్ట్స్ అకాడమీని స్థాపించి దాదాపు 40 ఏళ్ల పాటు ఎంతో మందికి కూచిపూడిలో శిక్షణ ఇచ్చారు. 2001లో శోభానాయుడు పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed