- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో పద్మశ్రీ అవార్డు గ్రహీత మృతి
కోల్‌కతా: అటామిక్ ఎనర్జీ కమిషన్ మాజీ చైర్మన్, న్యూక్లియర్ శాస్త్రవేత్త, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శేఖర్ బసు (68) కరోనాతో మృతిచెందారు. కొద్దిరోజుల క్రితం ఆయనకు కొవిడ్ పాజిటివ్‌గా తేలడంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. 2014లో పద్మ శ్రీ అవార్డు అందుకున్న శేఖర్ బాబుకు కిడ్నీ సమస్యలు కూడా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
మెకానికల్ ఇంజినీర్ అయిన డాక్టర్ బసు దేశ అణు ఇంధన రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. భారత తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ రూపకల్పనలోనూ శేఖర్ బసు కీలక పాత్ర పోషించారు. అణుశక్తి అభివృద్ధిలో విశేష సేవలందించిన శేఖర్ బసుకు భారత ప్రభుత్వం 2002లో ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ అవార్డు, 2006, 2007లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, 2014లో పద్మ శ్రీ అవార్డులతో సత్కరించింది. కాగా, శేఖర్ బసు మృతిపై కేంద్ర అటామిక్ ఎనర్జీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను ఎంతగానో బాధిస్తోందని వాపోయారు.