APERC చైర్మన్‌ను కలిసిన పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌..

by srinivas |
payyavla
X

దిశ, ఏపీ బ్యూరో: విద్యుత్ తక్కువ ధరకు లభిస్తుంటే.. వైసీపీ ప్రభుత్వం అధిక ధర వెచ్చించి కొనుగోలు చేస్తున్నారని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో మంగళవారం ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను కలిశారు. సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సెకీ నుంచి యూనిట్ రూ. 2.49కు కొనుగోలు చేస్తున్న అంశాలపైన పయ్యావుల కేశవ్ ఏపీఈఆర్‌సీ చైర్మన్‌‌తో చర్చించారు. సమావేశం అనంతరం పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ… విద్యుత్‌ ఒప్పందాలపై ఉన్న అనుమానాలను చైర్మన్‌ ద‌ృష్టికి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. విద్యుత్ వినియోగదారుడిపై భారం పడకుండా చూడాలని కోరినట్లు వెల్లడించారు.

విద్యుత్ ఖచ్చితంగా ఏ ధరకు వస్తుందో చెప్పాలని, ఏపీ ప్రభుత్వ వివరణ అసమగ్రంగా ఉందని విమర్శించారు. ఏపీఈఆర్‌సీ అనుమతిపైనా వైసీపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని చైర్మన్ దృష్టి్కి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రైతుల కోసం విద్యుత్ కొనుగోలు చేస్తే సంతోషమేనని ఆ విషయంపై తప్పు పట్టట్లేదని వివరించారు. వినియోగదారులపై అధిక భారం లేకుండా చూస్తానని ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌ హామీ ఇచ్చారని పీఏసీ చైర్మన్ పయ్యావుల వివరించారు.

Advertisement

Next Story

Most Viewed