- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయో హోటల్స్‌లో బ్రాహ్మణులకు 30 శాతం డిస్కౌంట్
దిశ, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణులకు అనేక రంగాల్లో రాయితీలతో సేవలు అందిస్తున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ వేదిక కార్యనిర్వాహక సెక్రటరీ బాలశ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే అనేక హాస్పిటల్స్, డయాగ్నొస్టిక్ సెంటర్స్, అపోలో ఫార్మసీ, తెలంగాణ గాయత్రి విద్య సంస్థలు, కరివేన నిత్య అన్నదాన సత్రాలతో ఒప్పందం కుదుర్చుకొని బ్రాహ్మణులందరికి తక్కువ ఖర్చుతో సేవలు అందిస్తున్నది.
అందులో భాగంగా బ్రాహ్మణ సంక్షేమ వేదిక ప్రస్తుతం ఓయో హోటల్స్, రూమ్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా, యాత్రలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు ఈ సౌలభ్యం సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. దాదాపు 30 శాతం రాయితీతో ఉండొచ్చునన్నారు. 250 ప్రముఖ నగరాల్లో దాదాపు 9,500 హోటల్స్ ఉన్న ఈ ఓయో సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవడం బ్రాహ్మణ సంక్షేమ వేదికకు ఒక గొప్ప విషయమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్రాహ్మణులెవరైనా ఉచితంగా ఈ సేవలను అందుకోవచ్చన్నారు. అవసరమైన వారు 9059550280 కు కాల్ చేయవచ్చని బాల శ్రీనివాసులు తెలిపారు.