పర్యాటక రంగం అభివృద్ధికి 'చాట్' ఏర్పాటు..

by Harish |   ( Updated:2021-06-09 06:05:47.0  )
పర్యాటక రంగం అభివృద్ధికి చాట్ ఏర్పాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ మహమ్మారి కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రంగాల్లో పర్యాటక రంగం ముందు వరుసలో ఉంది. కార్యకలాపాలను కూడా నిర్వహించలేని స్థాయిలో పడిపోయిన ఈ రంగంలో పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకునే ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ నేపథ్యంలో ఈ రంగంలోని హాస్పిటాలిటీ, ట్రావెల్ కంపెనీలైన ఓయో, ఎయిర్‌బీఎన్‌బీ, ఈజ్‌మైట్రిప్, యాత్రా కలిసి సంయుక్తంగా పర్యాటక రంగానికి కొత్త పరిశ్రమ సంఘం కాన్ఫెడరేషన్ ఆఫ్ హాస్పిటాలిటీ, టెక్నాలజీ అండ్ టూరిజం ఇండస్ట్రీ(చాట్)ను ప్రారంభించాయి. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమక్షంలో ఈ సంఘాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ పరిశ్రమ ద్వారా చిన్న కంపెనీలు, ట్రావెల్ అండ్ హాస్పిటలిటీ టెక్నాలజీ సంస్థలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పనిచేస్తాయని వారు తెలిపారు.

దేశీయ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే కాకుండ డిజిటల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్ కోసం సహాయపడుతుంది. శిక్షణా కార్యక్రమాలను కూడా నిర్వహించినున్నట్టు కంపెనీల వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా సాధారణ కార్యక్రమాలు, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. అలాగే ట్రావెల్-టెక్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి నిపుణులు, ఇతరులతో చర్చించి అవసరమైన ప్రయోజనాలను పొందవచ్చని పరిశ్రమ సంఘం చాట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంఘంలో ఎయిర్‌బీఎన్‌బీ ఇండియా జనరల్ మేనేజర్ అమన్‌ప్రీత్ బజాజ్, ఈజీమైట్రిప్ సీఈఓ నిశాంత్ పిట్టి, ఓయో ఇండీయా సీఈఓ రోహిత్ కంపూరు, యాత్రా సీఈఓ ధృవ్ శ్రింగి సభ్యులుగా ఉన్నారు. దేశీయ పర్యాటన రంగం వృద్ధికి, చిన్న హోటల్ వారు, ఏజెంట్లకు ఈ పరిశ్రమల సణం ఎంతో మేలు చేస్తుందని ప్రహ్లాద్ సింగ్ పటేల్ అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed