ఒలింపిక్స్ రద్దు చేయండి

by Shyam |
ఒలింపిక్స్ రద్దు చేయండి
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జూలై 24 నుంచి జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ 2020ను వచ్చే ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మెగా ఈవెంట్‌ను జపాన్‌లో నిర్వహించవద్దని అక్కడి మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా టోక్యోలో నివసించే ప్రజలు ఈ ఒలింపిక్స్ పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నారు. 2021లో కూడా ఒలింపిక్స్ నిర్వహించవద్దని 50శాతానికిపైగా ప్రజలు కోరుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. జపాన్‌కు చెందిన ప్రముఖ వార్తా సంస్థలు నిర్వహించిన టెలిఫోనిక్ పోల్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలో 1030మంది పాల్గొనగా 51.7శాతం మంది ఒలింపిక్స్ 2021లో కూడా జరిగే అవకాశమే లేదని చెప్పారు. మిగిలిన 48.3శాతం మంది మాత్రం ఒలింపిక్స్ జరిగే అవకాశం ఉందని చెప్పారు. అయితే, ఒలింపిక్స్‌ను వ్యతిరేకించిన వారిలో 27.7శాతం మంది ఆటలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండు చేశారు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో గేమ్స్ నిర్వహణ అంత భద్రం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రేక్షకులు లేకుండా క్రీడలు జరగాలని కోరుకునేవారు 31.1శాతం ఉండగా, 15.2శాతం మంది పూర్తిస్థాయి ఒలింపిక్స్‌ను కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed