- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను రిఫర్ చేస్తా.. ఫీజు కూడా తక్కువే
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ‘‘కరోనా కేసా.. అయితే మనకు తెలిసిన ఆసుపత్రిలో ప్యాకేజీ వైద్యం అందిస్తున్నాం. ఐసీయూకు ఓ రేటు, వెంటిలేటర్, ఆక్సిజన్ పెడితే ఇంకో రేటు. కార్డియాక్, ఆస్తమా, మధుమేహ వ్యాధిగ్రస్తులకు సెపరేట్ ట్రీ ట్మెంట్ ప్రత్యేకత.”
‘‘నిజామాబాద్ నగరంలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు, ప్రత్యేక వైద్య సదుపాయాలు ఉన్నాయి. వెల్ ట్రైన్డ్ నర్సింగ్ స్టాఫ్ ఉంది. అక్కడికి వెళ్తే కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చు.. నేను రిఫర్ చేస్తా.. నీకు ఫీజు కూడా తక్కువ తీసుకుంటారు.’’ ఇది ఓ చిన్న ఆస్పత్రి డాక్టర్‌కు కొవిడ్ బాధితుడి బంధువుకు, ఆర్ఎంపీకి కరోనా అనుమానితుడి మధ్య జరిగిన సంభాషణలు. ఇలా నిజామాబాద్‌నగరంలో ‘రిఫరల్ దందా’ మూడు పూలు, ఆరు కాయలు అన్నట్లు సాగుతోందనే
ఆరోపణలున్నాయి.
లాక్డౌన్ సమయంలో నిజామాబాద్‌లో సాధారణ రోగానికి సైతం వైద్యం చేసేందుకు డాక్టర్లు భయపడ్డారు. ఆసుపత్రులను తెరిచేందుకు కూడా సాహసించలేదు. ఆ తరువాత అన్ లాక్ 3 లో ప్రైవేట్ దవాఖానల్లో వైద్యానికి షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. కానీ, వాటిని అవి తుంగలో తొక్కాయి. అధికార యం త్రాంగం కేవలం సర్కారు ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు అడిగిన వారికి కాదనకుండా ‘ప్రైవేటు’కు అనుమతులు ఇచ్చింది. ఇదే అదనుగా భావించిన హాస్పిటల్ప్ మేనేజ్మెంట్లు లాక్ డౌన్ కాలంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడ్డారు.
‘రిఫరల్’ వైద్యానికి కేరాఫ్ నిజామాబాద్
నిజామాబాద్ నగరం ‘రిఫరల్’ వైద్యానికి పెట్టింది పేరు. ప్రభు త్వం ‘ప్రైవేట్’ లో కొవిడ్ వైద్యానికి అనుమతులు ఇవ్వడంతో దా నిని సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి అనుమతి వచ్చిన ఆసుపత్రులు. ఆర్‌ఎంపీలు, పీఎంపీలతో పాటు స్థానికంగా ఉండే చిన్న చిన్న హాస్పిటల్ డాక్టర్లతో టచ్‌లో ఉంటూ అక్కడి కేసులను తమ ఆస్పత్రికి వచ్చేలా చూస్తున్నారు. కేసులు పంపినందుకు దాదాపు 40 శాతం కమీషన్ ముట్టజెప్తారనే ఆరోపణలున్నాయి.
అనుమతుల వరకే అధికారుల పనా..?
జిల్లా కేంద్రంలో కొవిడ్ వైద్యానికి అనుమతి వచ్చిన ప్రైవేటు ఆస్పత్రులు నిబంధనలకు విరు ద్ధంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. కనీసం ఫీజుల చార్టు ప్రదర్శించడం లేదు. అయితే అనుమతుల వరకే తమ పని అని, ఫీజుల వసూలు వ్యవహారం తమది కాదన్నట్లు వైద్యారో గ్య శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారనే విమర్శ లు ఉన్నాయి. ప్రభుత్వం నిర్ధేశించిన ఫీజుల కంటే రెట్టింపు డబ్బులు గుంజుతున్నాయని బాధితులు బంధువులు వాపోతున్నారు. ఈ విషయమై టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం కోసం హైదరాబాద్‌కు వెళ్లే బదులు నిజామాబాద్ లో చేసుకుందామనుకునే వారికి ఫీజులు తడిసి మోపెడు అవుతున్నాయి. దానికి తోడు సర్కారు దవాఖానాల్లో పనిచేస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తున్న కొందరు డాక్టర్లు కొవిడ్ వైద్యం చేసేందుకు తమ హాస్పిటళ్లకు అనుమతులు తెచ్చుకున్నారు. సర్కారు దవాఖానాకు వచ్చిన రోగులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తూ రోగులను దోచుకుంటున్నారు. రిఫరల్, కమీషన్ దందాతో ప్రస్తుతం కరోనా వైద్యం కాస్ట్లీగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి నిబంధనలు పాటించని ఆసుప్రతులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.