కొత్త చట్టం వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి?

by Shamantha N |
కొత్త చట్టం వస్తే వాళ్ల పరిస్థితి ఏంటి?
X

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశం కువైట్ సుమారు 8 లక్షల మంది ప్రవాస భారతీయులను ఇంటికి పంపించడానికి సిద్ధమవుతోంది. దేశంలో విదేశీయుల కోటా తగ్గించే బిల్లును ఆ దేశ చట్టసభ్యులు ఆమోదించనున్నారు. కరోనాతో ప్రపంచదేశాల్లాగే కువైట్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. దేశాలన్నీ లాక్‌డౌన్ విధించడంతో పెట్రోల్ వ్యాపారం ఒడిదుడుకులనెదుర్కొంది. దీంతో స్థానికులకు ఉపాధి కల్పించడానికి ఆపసోపాలు పడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఉపాధి వెతుక్కుంటూ వచ్చిన విదేశీయులను ఇంటికి సాగనంపాలని ఐదుగురు పార్లమెంటు సభ్యులు ప్రతిపాదించారు. ఈ బిల్లును కువైల్ నేషనల్ అసెంబ్లీ లీగల్, లెజస్లేటివ్ కమిటీలు ఆమోదించాయి. ఈ డ్రాఫ్ట్‌పై తుదినిర్ణయం స్టాండింగ్ కమిటీ తీసుకోనుంది. 48లక్షల జనాభా గల కువైట్‌లో భారతీయులు సుమారు 14 లక్షలు. దేశ జనాభాలో విదేశీయుల శాతం 30కే కుదించేలా చట్టాన్ని తెస్తున్నట్టు పీఎం షేక్ సబా అల్ ఖాలిద్ అల్ సబా పేర్కొన్నట్టు సమాచారం. ప్రస్తుతం దేశ జనాభాలో 70శాతం మంది విదేశీయులున్నారు. అందులోనూ భారతీయులు కువైట్ జనాభాలో 15శాతం మించొద్దని నిబంధనలు రూపొందిస్తున్నది. చట్టం అమలైతే సుమారు ఎనిమిది లక్షల మంది ఇంటిదారి పట్టక తప్పనిపరిస్థితులు రానున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story