దేశంలో మెరుగుపడుతున్న ఆ రంగాలు ఏవంటే ?

by Harish |
fikky
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్నప్పటికీ తయారీ కార్యకలాపాలు గణనీయంగా మెరుగుపడ్డాయని పరిశ్రమల ఛాంబర్ ఫిక్కీ వెల్లడించింది. దీనిపై త్రైమాసిక నివేదిక రూపొందించిన ఫిక్కీ ఉత్పత్తి వ్యయం పెరిగేందుకు ప్రధానంగా అధిక స్థిర వ్యయం, భద్రతా చర్యలు, అధిక ఓవర్‌హెడ్ ఖర్చులు, లాక్‌డౌన్ వల్ల వాల్యూమ్‌ల తగ్గింపులే కారణమని తెలిపింది. తక్కువ సామర్థ్యం వినియోగం, అధిక సరుకుల ఛార్జీలు, ఇతర లాజిస్టిక్ ఖర్చులు, ముడి పదార్థాల పెరుగుదల, విద్యుత్ వ్యయం, అధిక వడ్డీ రేట్లు వల్లనే ఉత్పత్తి వ్యయం అధికంగా ఉన్నట్టు ఫిక్కీ పేర్కొంది.

కరోనా పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంతో పోలిస్తే జూలై-సెప్టెంబర్ మధ్య తయారీ గణనీయంగా మెరుగుపడింది. సమీక్షించిన కాలంలో ఎగుమతులు సైతం గణనీయంగా మెరుగుపడినట్టు తెలుస్తోంది. రానున్న మూడు నెలల్లో అదనపు ఉద్యోగులను నియమించే అవకాశాల్లేవని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేశాయి. దేశీయంగా రూ. 2.7 లక్షల కోట్లకు పైగా వార్షిక టర్నోవర్‌తో ఎస్ఎంఈ రంగాల్లోని 300 తయారీ పరిశ్రమల నుంచి ఫిక్కీ అభిప్రాయాలను సేకరించింది.

Advertisement

Next Story

Most Viewed