ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘35 చిన్న కథ కాదు’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

by Hamsa |
ఇట్స్ అఫీషియల్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘35 చిన్న కథ కాదు’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వ దేవ్, గౌతమి, భాగ్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘35 చిన్న కథ కాదు’. దీనిని నంద కిషోర్ తెరకెక్కించగా.. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రానా, సృజన యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. అయితే ఈ మూవీ ఒకసారి వాయిదా పడి సెప్టెంబర్ 6న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదలై పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

తాజాగా, ‘35 చిన్న కథ కాదు’ మూవీ ఓటీటీ అప్డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకోగా అక్టోబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఈ చిన్న కథలో వెనుక పెద్ద పాఠం ఉంది! మన ఇంటి కథలా అనిపిస్తుంది’’ అనే క్యాప్షన్ జత చేసి పోస్టర్‌ను షేర్ చేశారు. అయితే ఈ చిత్రం విడుదలైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతుండటంతో దీనిని చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story