Thangalaan: ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘తంగలాన్’.. వైరల్ అవుతున్న పోస్ట్

by Hamsa |
Thangalaan: ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బస్టర్ హిట్ ‘తంగలాన్’.. వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’. దీనిని బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన పా. రంజిత్ తెరకెక్కించగా.. పార్వతి తిరువొతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. అయితే దీనిని 1850లో జరిగిన కథాంశంతో రూపొందించారు. ముఖ్యంగా గిరిజనులను ఉపయోగించుకుని బ్రిటిష్ వారు బంగారాన్ని కొల్లగొట్టారో ఇందులో కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అయితే ఈ సినిమాకు జీవీ ప్రకాష్ సంగీతం అందించగా.. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తంగలాన్ ఆగస్టు 15న థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

అంతేకాకుండా భారీగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద సునామి సృష్టించింది. తమిళంలో రూ. 100 కోట్లు పైగానే వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. తంగలాన్ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 20 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ అందుబాటులోకి కూడా రాబోతున్నట్లు నెట్టింట ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది.

కానీ నెట్‌ఫ్లిక్స్ మాత్రం అధికారిక ప్రకటనను సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విక్రమ్ అభిమానులు అయోమయంలో పడి పోయారు. అయితే హిందీలో మాత్రం సెప్టెంబర్ 27 స్ట్రీమింగ్ కానున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ తంగలాన్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై అధికారికంగా ఎలాంటి పోస్ట్ విడుదల కాకపోవడంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed