- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు మూవీ.. పది రోజుల్లోనే సరికొత్త రికార్డు (పోస్ట్)
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా ఓటీటీలో పలు సినిమాలు ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకుంటూ దుమ్మురేపుతున్నాయి. థియేటర్స్‌లో మెప్పించలేని చిత్రాలు సైతం డిజిటల్ స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డులు సాధిస్తున్నాయి. తాజాగా, తెలుగు కామెడీ మూవీ ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’ ( Maruthi Nagar Subramanyam )ఓటీటీలో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ‘X’ వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేసింది. సెప్టెంబర్ 20న స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చిన మారుతీ నగర్ సుబ్రమణ్యం కేవలం పది రోజుల్లోనే 150 మిలియన్ ప్లస్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్కు దాటింది.
ఈ విషయాన్ని అధికారికంగా ఆహా ప్రకటిస్తూ.. ‘‘150 మిలియన్ ప్లస్ నాన్ స్టాప్ నవ్వులు, వినోదం. మారుతీ నగర్ సుబ్రమణ్యం ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా, ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించగా.. డైరెక్టర్ లక్ష్మణ్ కార్య తెరకెక్కించారు. ఇందులో అంకిత్ కొయ్య, రమ్మ పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, ప్రవీణ్, అన్న పూర్ణమ్మ కీలక పాత్రలో నటించారు. అయితే ఈ మూవీ ఆగస్టు 23న థియేటర్స్‌లో విడుదల పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలువురు సినీ ప్రముఖ ప్రశంసలు కూడా కురిపించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో కూడా దూసుకుపోతుంది.