- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
9 నెలల తర్వాత ఓటీటీలోకి అనసూయ కాంట్రవర్సీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
దిశ, సినిమా: యాట సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘రజాకార్’. ఈ మూవీ భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం, రజాకార్ల పాలన వంటి చారిత్రాత్మక అంశాలను స్పృశిస్తూ తెరకెక్కింది. ఇక ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ్, ఇంద్రజ, బాబీ, సింహా, వేదిక, ప్రేమ, మకరంద్ పాండే, రాజ్ అర్జున్, తేజ్ సప్రు, జాన్ విజయ్, దేవీ ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ మూవీ రిలీజ్‌కి ముందే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నది. అలా విమర్శల మధ్య విడుదలైన ఈ సినిమా కొన్ని వర్గాల వాళ్ళను మాత్రమే మెప్పించింది.
ఇదిలా ఉంటే.. గత 9 నెలల క్రితం థియేటర్లలో రిలీజైన రజాకార్ మూవీ ఇప్పటి వరకు ఓటీటీలోకి రాలేదు. అయితే ఎట్టకేలకు ఈ కాంట్రవర్సీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి ఆహా.. రజాకార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే ఈ సినిమాను ఓటీటీ ఆడియన్స్ ముందుకు తీసుకోరాబోతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. కాగా ఈ సినిమా డిసెంబర్ 20 లేదా 26న ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం.