- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూ భూముల కేసు 19కి వాయిదా
దిశ, న్యూస్‌బ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయం భూములపై విచారణ కేసును హైకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఓయూ భూములను రక్షించాలని కోరుతూ పీహెచ్‌డీ విద్యార్థి రమణరావు రాసిన లేఖను విచారణకు స్వీకరించిన కోర్టు ఈనెల 19కి విచారణను వాయిదా వేసింది. ఓయూలో సుమారు 8వేల చదరపు గజాల భూమి కబ్జా అవుతోందని లేఖలో పేర్కొన్న పిటిషనర్ భూములను సర్వే చేసి కాపాడేందుకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. ప్రభుత్వ సీఎస్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సీసీఎల్ఏ, ఓయూ వీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
విద్యాశాఖ మంత్రికి విన్నపం
ఓయూ భూములను అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. లాక్‌డౌన్‌ను ఉపయోగించుకొని కొందరు కబ్జాదారులు ఓయూ భూములను ఆక్రమించకుంటున్నారని ఏబీవీపీ నాయకులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సీడబ్ల్యూసీ సభ్యులు ప్రవీణ్, ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి శ్రీహరి, సుమన్, శంకర్, కడియం రాజు పాల్గొన్నారు.