- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉస్మానియాలో పెచ్చులూడిన శ్లాబు
by Shyam |
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మానియా ఆస్పత్రిలోని కూలీ కుతుబ్ షా భవనంలోని రెండో అంతస్థు టాయిలెట్‌లో శ్లాబు పెచ్చులూడింది. అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కార్డియాలజీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గదిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున పెద్ద శబ్ధంతో పెచ్చులూడి టాయిలెట్ బేసిన్ పై పడడంతో రోగులు, సిబ్బంది, వైద్యులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ వెంటనే ఘటన స్థలాన్ని పరిశీలించారు. తక్షణమే మరమ్మత్తు పనులు చేపడతామని, ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కాగా, ఇటీవల కురిసిన వర్షాలకు ఆసుపత్రి ఆవరణలోకి వర్షం నీరు చేరడంతో పాత భవనాన్ని ఖాళీ చేసిన సంగతి తెలిసిందే.
Advertisement
Next Story