ఆ సింహాన్ని దత్తత తీసుకున్న ఫార్మాస్యూటికర్ కంపెనీ..

by Shyam |
ఆ సింహాన్ని దత్తత తీసుకున్న ఫార్మాస్యూటికర్ కంపెనీ..
X

దిశ, చార్మినార్:​ ఆరిజిన్​ ఫార్మాస్యూటికర్​ సర్వీసెస్​ లిమిటెడ్​ మియాపూర్​ ఆధ్వర్యంలో జూ పార్కులోని మరోహర్​ అనే ఆఫ్రికన్​ సింహాన్ని సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు లక్షరూపాయల చెక్కును జూ క్యూరేటర్​ ఎస్​.రాజశేఖర్​కు అందజేశారు. రెండు సంవత్సరాలుగా జంతువులను దత్తత తీసుకుంటున్న ఆరిజిన్​ ఫార్మాస్యూటికర్​ సర్వీసెస్​ లిమిటెడ్​ ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గత సంవత్సరం కూడా రాయల్​ బెంగాల్​ టైగర్​ను దత్తత తీసుకున్నట్లు రాజశేఖర్​ పేర్కొన్నారు.

Advertisement

Next Story