కొత్త పోస్టింగ్‌పై అభ్యంతరాలున్నాయా..?

by Shyam |
telangana-employees
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలో నూతన జోనల్ విధానంలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు తీసుకున్న క్రమంలో సీనియారిటీ ఆధారంగా కేడర్‌ను బట్టి వారిని జిల్లా, జోన్, మల్టీ జోన్లు కేటాయించనున్నారు. అయితే, ఇప్పటికే జిల్లా కేడర్ ఉద్యోగులకు కేటాయింపులు పూర్తయ్యాయి. అయితే, కొత్త పోస్టింగుల్లో చేసేందుకు అభ్యంతరాలుంటే వారి నుంచి ఉద్యోగులు అప్పీల్ చేసుకునే అవకాశం కల్పిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జిల్లా కేడర్ ఉద్యోగులు జిల్లా హెచ్‌వోడీలకు, జోనల్, మల్టీజోనల్ కేడర్ ఉద్యోగులు డిపార్ట్మెంట్ హెచ్‌వోడీలకు అప్పీల్ చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగుల నుంచి వచ్చిన అప్పీల్లను సంబంధిత శాఖ కార్యదర్శి వద్దకు చేరుతాయి. విచారణ పూర్తయ్యాక అప్పీల్లను పరిష్కరిస్తారు.

Advertisement

Next Story