ధరణిలో కోర్టు డిక్రీల అమలుకు ఆప్షన్లు

by Shyam |
ధరణిలో కోర్టు డిక్రీల అమలుకు ఆప్షన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వ్యవసాయ భూములకు నిర్దేశించిన ధరణి పోర్టల్​లో కోర్టు డిక్రీలను అమలు చేసేందుకు ఆప్షన్ ఇచ్చారు. సిటిజన్ లాగిన్​ద్వారా వెబ్​పోర్టల్​లోకి వెళ్లి పూర్తి వివరాలను నమోదు చేయాలి. ఊరు, మండలం, జిల్లా వంటి వివరాలతో పాటు సర్వే నంబర్లు, విస్తీర్ణం, కేసుల వివరాలు, అంతకు ముందు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించిన అన్నింటినీ పేర్కొనాలి. కోర్టు ఇచ్చిన డిక్రీని కూడా నమోదు చేయాలి. అన్నింటిని పూర్తి చేయగానే తహశీల్దార్ లాగిన్​లోకి వస్తుంది. ఆయన పూర్తి వివరాలను పరిశీలిస్తారు. తనకు అన్నీ సక్రమంగా ఉన్నాయని భావిస్తే వెంటనే మ్యుటేషన్, పట్టాదారు పాసు పుస్తకం జారీ చేస్తారు. ఏదైనా అనుమానం ఉంటే, అనుమతి కోసం కలెక్టర్​కు ధరణి పోర్టల్ ​ద్వారానే పంపుతారు. పరిశీలించి ఆమోదిస్తే ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రెవెన్యూ అధికారొకరు వివరించారు. ఐతే సిటిజన్​లాగిన్​లోకి ఎలా వెళ్లాలి? ఏయే అంశాలను పూరించాలన్న వివరాలకు సంబంధించిన ప్రొసిజర్ కాపీ రాలేదు. త్వరలోనే పూర్తి పారదర్శకతతో ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఐతే డిక్రీ అమలుకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ధరణిలో ఉంది.

Advertisement

Next Story