లోక్‌సభలో విపక్షాల ఆందోళన

by Shamantha N |
లోక్‌సభలో విపక్షాల ఆందోళన
X

లోక్‌సభ ప్రారంభమైన కాసేపటికే ప్రతిపక్షాల నినాదాలతో దద్దరిల్లుతోంది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు ‘‘ షేమ్, షేమ్’’ సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సీఏఏ, ఎన్నార్సీలపై చర్చకు కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు పట్టుబట్టాయి. తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు సైతం ప్రతిపక్షంతో గొంతు కలిపారు. కాగా, మరోవైపు రాజ్యసభలోనూ తీవ్ర గందర గోళం నెలకొనడంతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు సభ వాయిదా పడింది.

Advertisement

Next Story

Most Viewed