కేటీఆర్ టూర్.. జోగులాంబలో కీలక నాయకుల ముందస్తు అరెస్టు

by Shyam |   ( Updated:2021-09-13 23:47:34.0  )
కేటీఆర్ టూర్.. జోగులాంబలో కీలక నాయకుల ముందస్తు అరెస్టు
X

దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కోసం పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వస్తుండటంతో ప్రజాసంఘ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలను అర్ధరాత్రి 12 గంటల నుండే పోలీసులు వారి ఇళ్ల వద్దకు వెళ్లి ముందస్తుగా అరెస్టులు చేశారు.

గత వారం రోజుల నుండి జిల్లాలో కేటీఆర్ రాకను వ్యతిరేకిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు, ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టారు. కేటీఆర్ జిల్లాకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తరువాతే జిల్లాలో అడుగుపెట్టాలని పలు పార్టీలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేటీఆర్ పర్యటనకు ఎలాంటి అవరోధం కలుగకుండా ముందస్తు అరెస్టులు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌ను అయిజ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేసి స్టేషన్‌‌కు తరలించారు.

Advertisement

Next Story