అగ్రిగోల్డ్ ఆస్తులపై అభ్యంతరాలకు వచ్చేనెల 10న అవకాశం

by Shyam |
అగ్రిగోల్డ్ ఆస్తులపై అభ్యంతరాలకు వచ్చేనెల 10న అవకాశం
X

దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జఫ్తు చేసి అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏమైనా అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉన్న సదరు వ్యక్తులు, సంస్థలు ఫిబ్రవరి 10న మహబూబ్ నగర్ జిల్లా ప్రిన్సిపాల్ అండ్ సెషన్స్ కోర్టులో తెలియజేయాలని సీఐడీ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గోవింద్ సింగ్ తెలిపారు. అగ్రిగోల్డ్ కంపెనీ మోసపూరిత ప్రకటనలతో ప్రజల నుంచి డిపాజిట్స్ సేకరించి, కంపెనీ మూసివేసినట్టు తెలిపారు. ఈ మోసాలపై ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ రూల్స్ 1999, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్య్కూలేషన్ స్కీమ్ (బానింగ్) యాక్ట్ ప్రకారం సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో సమగ్ర దర్యాప్తు నిర్వహించి, అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులను గుర్తించి ప్రభుత్వానికి నివేదించినట్టు చెప్పారు. దీంతో అగ్రిగోల్డ్ ఆస్తులను జఫ్తు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 44/2020 జీవోను విడుదల చేసిందన్నారు. ఈ జీవోకు అనుగుణంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ఎలాంటి క్రయ, విక్రయాలు చేయకూడదన్నారు.

Advertisement

Next Story

Most Viewed