సిద్దిపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

by Shyam |
సిద్దిపేటలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం
X

దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం వర్ధరాజ్‌పూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్నిమంత్రి హరీశ్‌రావు, ఎఫ్‌డీ‌సీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులంతా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు వాడాలని సూచించారు.

సీఎంఆర్ఎఫ్‌కు విరాళాలు

ఈ సందర్భంగా కరోనా కట్టడికి పలువురు విరాళాలు అందజేశారు. పాములపర్తి గ్రామానికి చెందిన హన్మకొండ చంద్రారెడ్డి రూ.5 లక్షలు, గజ్వేల్ నియోజకవర్గ ఏల్ఐసీ ఏజెంట్స్, సిబ్బంది రూ.51వేలు సీఎంఆర్ఎఫ్‌కు విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కులను హరీశ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, లైబ్రరీ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags: Opening, Rice, Purchasing Center, medak, minister harish rao, donations to cmrf, hanamkonda chandra reddy, gajwel LIC agents

Advertisement

Next Story

Most Viewed