- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆన్‌లైన్ సేవలొచ్చినా.. వారిదే హవా
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ప్రభుత్వ ఆఫీస్‌ల్లో అవినీతిని నిర్మూలించాలని రాష్ట్ర ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది. అందుకోసం ప్రభుత్వం ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయినా ఆర్టీఏ ఆఫీస్‌ల్లో ఆ ఛాయలే కనిపించవు.. సామాన్యుడు నేరుగా ఆర్టీఏ కార్యాలయంలోకి వెళ్లి పనులు చేయించుకునే పరిస్థితే లేదు.. ఏజెంట్లు లేకుండా వెళ్తే.. అంతే సంగతి.. ఇదీ లేదు అది లేదు అని కుంటి సాకులతో కాలయాపన చేస్తారు. ఒకవేళ అన్ని ఉన్నప్పటికీ దరఖాస్తు చేయడంలో నిర్లక్ష్యం చేస్తూ సంబంధిత కార్డుల జారీలో ఆలస్యం చేస్తారు. ఏజెంట్లతో కుమ్మక్కై ఆర్టీఏ అధికారులు, సిబ్బంది ప్రజలను పిడించుకుతింటున్నారు.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 11ఆర్టీఏ ఆఫీసులున్నాయి. అన్ని ఆఫీసుల్లో ఆన్‌లైన్ సేవలు అమలులో ఉన్నప్పటికీ పబ్లిక్ సర్వీస్‌కు దూరంగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఆఫీస్ కు ఓ వ్యక్తి వాహనం ఫైనాన్స్ లో ఉంది. ఆ వాహనం ఫైనాన్స్ రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత యజమానికి బదిలీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇందుకు ఆ వ్యక్తి స్లాట్ బుకింగ్ చేసుకోని అందుకు సంబంధించిన చలాన్ చెల్లించిన రశీద్, ఆధార్ కార్డు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ పత్రాలను జత చేసి ఇచ్చారు. అయినా ఫాం సరిగ్గా పూర్తి చేయలేదని చెప్పి సిబ్బంది జాప్యం చేస్తున్నారు. గట్టిగా అడిగితే దరఖాస్తు తీసుకన్నప్పటికీ తిరిగి మళ్లీ వచ్చేటట్టు టెక్నికల్ గా అనుమతి పొదకుండా చేయడం జరుగుతుంది. ఈ విధంగా రోజుకు 10మంది వరకు తిరిగిపోతున్నట్లు అక్కడున్న కొంత మంది అధికారులే వివరిస్తున్నారు. ఏజెంట్లను బ్రోకర్లుగా ఏర్పాటు చేసుకోని నేరుగా వచ్చే వాళ్లకు కొర్రిలతో సమాధానం చెప్పి పంపిస్తున్నారు. అంతేకాక బయట ఒకరుంటారని ఏజెంట్ల పేరు చెబుతున్నారు. అదే ఏజెంట్ ద్వారా వచ్చే దరఖాస్తులకు ఏదీ ఉన్నా.. లేకున్నా.. కొర్రీలు పెట్టకుండానే అనుమతులు ఇవ్వడం, కార్డులు జారీ చేయడం జరుగుతుంది. ఈ విధంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ కార్యాలయాల్లో దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది.
పారదర్శకత ఎక్కడా…?
ప్రభుత్వం ఆశించిన స్ధాయిలో ఆర్టీఏ ఆఫీస్‌లో వ్యవస్థ పనిచేయడం లేదని స్పష్టమవుతుంది. ఈ సంస్థలో జరిగే 15 రకాల సేవలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. అంతేకాకుండా పారదర్శకంగా సేవలు అందించాలని లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులు చెల్లిస్తున్నారు. కానీ సేవలు మొత్తం ఆఫ్‌లైన్ ద్వారానే కొనసాగిస్తున్నారు. దీంతో అధికారులు, సిబ్బందికి ఏజెంట్ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి. దీంతో రవాణా శాఖలో కాగిత, నగదు రహిత సేవలను అమలు చేయడంలో ఆర్టీఏ సంస్థ విఫలమవుతుంది. ఏ ప్రభుత్వ సంస్థల్లో కూడా ఈ స్థాయిలో అవినీతి లేదనే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే దేశంలోనే ప్రప్రథమంగా ఆర్టీఏ ఎం-వ్యాలెట్ మొబైల్‌యాప్‌ను, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల డిజిటల్ పత్రాలు స్మార్ట్‌ఫోన్‌లోనే భద్రపర్చుకొనే అవకాశం కల్పించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
సజావుగా స్లాట్ బుకింగ్..
ఆన్‌లైన్‌లోనే ఆర్టీఏ సేవలన్న నిబంధన అమలైతే ఇక నుంచి ఎవరైనా స్లాట్ బుకింగ్‌తోనే ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. రవాణా శాఖలో ఇదొక్కటే ప్రయోజనత్మకంగా కొనసాగుతుంది. మిగిలిన సేవలు ఆప్రయోజనంగానే కనిపిస్తున్నాయి. ప్రతి రోజు అత్యధిక ఆదాయానిస్తున్న సంస్థ ఆర్టీఏనే. కానీ ప్రభుత్వానికి అధికారికంగా వచ్చే ఆదాయం కంటే అధికారులకు, సిబ్బందికి వచ్చే ఆదాయమే ఎక్కవగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి.
కార్డుల జారీలో జాప్యం…
ఆర్టీఏ నుంచి జారీ అయ్యే లైసెన్స్, ఆర్సీ కార్డుల జారీలో జాప్యం జరుగుతుందని అధికారులు వివరిస్తున్నారు. కరోనా కాలం నుంచి కార్డుల కొరత ఏర్పడినట్లు సమాచారం. సుమారుగా నాలుగు నెలలుగా కార్డుల జారీలో ఆలస్యమైనట్లు తెలుస్తోంది. సోమవారం డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు సుమారుగా రెండు నెలల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అప్పటికీ.. వస్తే వస్తది.. లేకపోతే ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు.