మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇంటి వద్దకే మద్యం సరఫరా

by vinod kumar |
మందు బాబులకు గుడ్‌న్యూస్.. ఇంటి వద్దకే మద్యం సరఫరా
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సౌత్, ఈశాన్యంలో ఒకటి, రెండు రాష్ట్రాలు మినహా ప్రస్తుతం దేశమంతటా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. నిర్భంధం మూలానా రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది. రెవెన్యూ లేక సంక్షేమ పథకాల అమలుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

లాక్‌డౌన్ సమయంలో రెవెన్యూ పెంచుకోవడానికి కొత్త ఆలోచన చేసింది. ఇంటి వద్దకే మద్యాన్ని హోం డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీనిద్వారా రాష్ట్ర ఖజనాకు ఆదాయం సమకూరనుంది. csmcl వెబ్‌సైట్ ద్వారా సోమవారం నుంచి ఆన్‌లైన్‌లో మద్యాన్ని విక్రయించనున్నారు. బుక్ చేసిన వారికి హోం డెలివరీ సదుపాయాన్ని సైతం కల్పించారు. ఉదయం 9గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్ లో మద్యాన్ని కొనుక్కునే అవకాశాన్ని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం రేపు ప్రారంభించనున్నది. ఇదిలాఉండగా, మే 15వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగనుంది.

Advertisement

Next Story