లాక్‌డౌన్‌లో గేమింగ్ రంగం ఊపందుకుంది కానీ…

by Harish |
లాక్‌డౌన్‌లో గేమింగ్ రంగం ఊపందుకుంది కానీ…
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ రంగం మాత్రమే కాదు గేమింగ్ రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. 1000 మందికి పైగా గేమర్లను సైబర్ సెక్యూరిటీ కంపెనీ బుల్‌గార్డ్ సర్వే చేసింది. వీరిలో 49 శాతం మంది లాక్‌డౌన్ సమయంలో గేమ్స్ తమకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పగా, 84 శాతం మంది తమ బోర్‌డమ్‌ని పొగొట్టే హాబీగా గేమింగ్ మారిందని చెప్పారు. దీని వల్ల గేమింగ్ రంగం 45 శాతం వృద్ధి చెందినప్పటికీ కొన్ని కొత్త సమస్యలు తెరమీదికి వచ్చాయని సర్వేలో వెల్లడైంది.

ప్రతి ఐదుగురు గేమర్లలో ఒకరు స్నానం చేయట్లేదని, 29 శాతం మంది అసలు మూడు రోజుల పాటు ఇంటి నుంచి బయటికే వెళ్లడం లేదని, ఇక 16 శాతం మంది మాత్రం పూర్తిగా పళ్లు కూడా తోముకోవట్లేదని ఈ సర్వేలో తేలింది. అయితే మానసికంగా ఈ వీడియో గేమ్‌లు స్థిమితాన్ని అందిస్తున్నప్పటికీ వ్యక్తిగతంగా పరిశుభ్రత సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో పాటు కొత్త గేమ్‌ల కోసం డబ్బులు ఖర్చుపెట్టడానికి కూడా వెనకాడటం లేదు. అంతేకాకుండా చాలా మంది గేమర్లు యాంటీ వైరస్ కూడా సరిగా వాడకపోవడంతో సైబర్ సెక్యూరిటీ ఇబ్బందులు కూడా తలెత్తున్నాయని బుల్‌గార్డ్ సర్వే పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed