- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆన్ లైన్ అమ్మకాలు షురూ!
దిశ, వెబ్ డెస్క్: కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్డౌన్ పొడిగించింది. అయితే ఈ సారి పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని సడలింపులకు అవకాశం ఇచ్చింది. కేంద్రం విడుదల చేసిన మార్గ దర్శకాల ప్రకారం ఈ కామర్స్ ప్లాట్ ఫామ్ లు అమ్మకాలు చేపట్టవచ్చు. దాంతో మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు సమాయత్తమయ్యాయి.. ఇప్పటివరకూ నిత్యావసర వస్తువులను మాత్రమే అనుమతినివ్వగా.. తాజా మార్గదర్శకాలతో నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లలో ఆన్ లైన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అన్నీరకాల గాడ్జెట్స్ తో పాటు కన్జ్యూమర్ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ తో సహా ఇ-కామర్స్ సంస్థలు కరోనా వైరస్ చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయా కంపెనీల ప్రతినిధులు తెలిపారు. రెడ్ జోన్లలో మాత్రం కిరాణా సరుకులు, మెడికల్, చిన్నారులకు సంబంధించి వస్తువులు మాత్రమే అందిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆయా జోన్లలో మాత్రమే ఆర్డర్లను అందిస్తామని, సాధారణ రోజుల్లో అందించే సమయం కంటే లాక్ డైన్ పీరియడ్ లో డెలివరీ చేసే సమయం ఎక్కువ అని తెలిపింది.ఆరెంజ్, గ్రీన్ జోన్లలో ప్రజలకు అవసరమైన వస్తువులను సురక్షితంగా డెలివరీ చేసేందుకు ప్రభుత్వం తమకు అనుమతినిచ్చేలా నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపాయి.
tags : online products, flipkart, amazon, grocery