ఆ నాణెం విలువ రూ.2.6కోట్లు..

by Harish |   ( Updated:2021-12-23 07:00:26.0  )
coin
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఆన్‌లైన్‌‌లో పురాతన నాణెం వేలం వేయగా అది అతి ఎక్కువ ధర పలికి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన పురాతన షిల్లింగ్ వెండి నాణెం 1652లో న్యూ ఇంగ్లాండ్‌లోని బోస్టన్‌లో ముద్రించిన మొదటి కాయిన్స్‌లలో ఒకటి. కాయిన్‌కు ఒకవైపు NE(న్యూ ఇంగ్లాండ్ కోసం) అని, మరొక వైపు రోమన్ సంఖ్య XII, షిల్లింగ్‌లోని 12పెన్నీలను సూచించే విధంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న చాలా నాణెలకు ఇది రోల్‌మోడల్‌గా ఉంది.

లండన్‌కు చెందిన మోర్టన్ & ఈడెన్ లిమిటెడ్ ఆన్‌లైన్‌లో వేలం వేయగా ఈ పురాతన షిల్లింగ్ వెండి కాయిన్‌ను అమెరికాకు చెందిన అనామక ఆన్‌లైన్ బిడ్డింగ్ ద్వారా రూ.2.6 కోట్లకు దక్కించుకుంది. ఊహించిన దాని కంటే అతి ఎక్కువ ధరకు ఇది అమ్ముడు పోయింది. దానికి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఇంత రేటు పలికింది అని కాయిన్ స్పెషలిస్ట్ జేమ్స్ మోర్టన్ తెలిపారు. ఇంతకు ముందు ఈ అరుదైన నాణెం ఒక మిఠాయి టిన్ బాక్స్‌లో లభ్యమైంది. 1652 కి ముందు, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, స్పానిష్ సామ్రాజ్యం నుండి వచ్చిన నాణెలు న్యూ ఇంగ్లాండ్‌లో కరెన్సీగా ఉపయోగించబడ్డాయి.

హీరోయిన్ వెంటపడి వేధిస్తున్న యువకుడు.

Advertisement

Next Story

Most Viewed