- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరుగుదొడ్లలో దుర్వాసన.. అసహనం వ్యక్తం చేసిన షర్మిల
దిశ, మహేశ్వరం: వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర ఆరో రోజుకు చేరుకుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామం నుంచి తుమ్మలూరు గేట్, రాచూలూరు గేట్, బైరాగి గూడ గేట్, లేమూర్ గేట్, లేమూర్, అగర్ మియాగూడ మీదుగా పాదయాత్ర చేస్తోంది. తుమ్మలూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టాయిలెట్స్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం గురించి, టీచింగ్ విధానం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లను కూడా ఆమె పరిశీలించింది. మరుగుదొడ్లలో దుర్వాసన రావడంతో షర్మిల అసహనం వ్యక్తం చేసింది. అనంతరం గ్రామంలో పాదయాత్ర చేస్తూ మహిళలను, వృద్ధులను పలకరిస్తూ మీ కుటుంబంలో యువకులకు కొలువులు వచ్చాయా? ఆసరా పెన్షన్లు, ఆరోగ్య శ్రీ పథకం అమలవుతుందా? అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండా రాఘవారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.