- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ అభ్యర్థుల హోరాహోరీ.. రెండో ప్రాధాన్యతలో కూడా మెజార్టీ రాకపోతే?
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల ఎమ్మెల్సీ స్థానంలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్‌తో పాటు, ఆగంమాగం అవుతున్నారు. అనూహ్యంగా తీన్మార్ మల్లన్న రెండోస్థానంలోకి దూసుకురావడంతో మొదటిస్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిలోనూ ఆందోళన నెలకొంది. అంతేగాకుండా మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజారిటీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అందరిచూపూ రెండో ప్రాధానత్య ఓట్లపై పడింది. రెండో ప్రాధాన్యత ఓట్లలో కూడా ఎవరికీ మెజార్టీ రాకపోతే.. ఎలిమినేషన్ వరకూ ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అదే జరిగితే తుది ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఇప్పటివరకూ జరిగిన మొత్తం మూడు రౌండ్లలో కలిపి నల్లగొండలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 47,545, తీన్మార్ మల్లన్న 35,858, ప్రొఫెసర్ కోదండరామ్ 29,567, ప్రేమెందర్ రెడ్డి 18,604 ఓట్లు నమోదు అయ్యాయి.