- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆరో విద్యార్థి జాడ ఏది.. మానేరులో మిస్సింగ్ మిస్టరీ..!
దిశ, సిరిసిల్ల: మానేరు నదిలో గల్లంతయిన ఆరుగురు విద్యార్థుల్లో మరో విద్యార్థి ఆచూకీపై మిస్టరీ వెంటాడుతున్నట్టుగా ఉంది. సోమవారం సిరిసిల్ల సమీపంలోని మానేరు వాగులో గల్లంతయిన ఆరుగురు విద్యార్థుల్లో ఐదుగురి ఆచూకీ కనుగొన్నారు. మరో విద్యార్థి సింగం మనోజ్ కోసం మంగళవారం రాత్రి వరకు వెతికినా ఫలితం కానరాలేదు. చెక్ డ్యాం కట్టడాల్లో చిక్కుకుని ఉంటారన్న అనుమానం అధికారుల్లో వ్యక్తం అవుతోంది. గజ ఈత గాళ్లు, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు అణువు అణువు గాలించినా మనోజ్ ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో బుధవారం వేకువ జాము నుంచి మరోసారి గాలించాలని అధికారులు నిర్ణయించారు.
టీ షర్టు.. చెప్పులే..
మానేరు వాగు ఒడ్డున టీ షర్టు, చెప్పులు మాత్రమే లభ్యం అయ్యాయి. జీన్స్ ప్యాంట్ మాత్రం దొరకలేదు. దీంతో మనోజ్ భయపడి అక్కడి నుంచి పరారీ అయ్యాడా..! అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. మానేరులో గల్లంతయిన వారిలో అందరికన్నా పెద్ద వాడు సింగం మనోజ్ ఒక్కడేనని పోలీసుల విచారణలో తేలింది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి కావడంతో అందరికన్నా వయసులో పెద్ద వాడు కావడంతో తనను ఏమైనా అంటారేమోనన్న భయంతో, మానేరు నదిలో కొట్టుకుపోయిన తన స్నేహితులను చూసి కలత చెంది అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
అయితే, జీన్స్ ప్యాంట్‌తోనే మానేరు నదిలోకి దిగి ఉంటాడా అన్న డౌట్ కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. నీటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వేరే చోటుకు కూడా కొట్టుకపోయి ఉంటాడా అని కూడా ఆరా తీస్తున్నారు. 24 గంటలు దాటినందున మనోజ్ శవం కూడా నీటిపై తేలాల్సి ఉన్నప్పటికీ చలి కాలం కావడం వల్ల పైకి రాకపోయి ఉండవచ్చని కూడా అంటున్నారు. గత నెలలో వచ్చిన భారీ వర్షాల కారణంగా ఇక్కడ నిర్మాణంలో ఉన్న చెక్ డ్యాం కొట్టుకపోయిన సంగతి తెలిసిందే.
ఈ చెక్ డ్యాంకు సంబంధించిన కట్టడాల్లో కానీ, స్టీల్ మధ్య కానీ మనోజ్ చిక్కుకుని ఉంటాడన్న అనుమానం కూడా అధికారులను వెంటాడుతోంది. ఈ క్రమంలోనే మనోజ్ కోసం బుధవారం కూడా గాలించాలని నిర్ణయించారు. మంగళవారం జరిపిన సెర్చింగ్ ఆపరేషన్ రాళ్లు, రప్పల సమీపంలో కూడా కొనసాగించారు. వెతకని ప్రాంతాలతో పాటు చెక్ డ్యాం నిర్మాణ ప్రాంతమంతా కూడా వెతకాలని నిర్ణయించుకున్నారు.