కరోనాతో ప్రేక్షకుడు.. ఆటగాళ్లలో దడ !

by Shyam |

ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ ‌కప్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ షాకింగ్‌గా మారింది. దీనికి సంబంధించి తాజాగా వెలువడిన ఓ వార్త.. ఆ మ్యాచ్‌ను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కూర్చొని చూసిన ప్రేక్షకులకు దడ పుట్టిస్తోంది. ఆ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన ఒక ప్రేక్షకుడికి కరోనా వైరస్ సోకినట్లు ఆస్ట్రేలియా ఆరోగ్య, మానవ సేవల విభాగం వెల్లడించింది. ఎంసీజీలోని నార్త్ స్టాండ్ లెవల్ 2లోని ఎన్ 42 సీట్లో కూర్చున్నట్లు వివరాలు చెప్పింది. కాగా అతని చుట్టుపక్కన కూర్చున్న ప్రేక్షకుల్లో ఎవరికీ కరోనా సోకే అవకాశం లేదని ఆరోగ్య విభాగం తేల్చింది. ఈ మ్యాచ్‌కు 86 వేల 174 మంది హాజరైతే వారిలో ఒకరికి మాత్రమే కరోనా ఉన్నట్లు తేలిందని అన్నారు.

Tags: ICC W20 Women, Ind vs Aus, Coronavirus, MCG,

Advertisement

Next Story