పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం

by Shamantha N |   ( Updated:2021-04-02 00:38:58.0  )
పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామాలోని కాకపొరాలో శుక్రవారం తెల్లవారు జామునే మొదలైన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్టు ప్రాథమికంగా తెలిసింది. కాగా, మరో ఇద్దరు టెర్రరిస్టులు పోలీసుల వలయంలో చిక్కుకున్నట్టు సమాచారం. ముందస్తు సమాచారం ఆధారంగా కాకపొరాలో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్ జరుగుతుండగానే కొందరు ఉగ్రవాదులు తమపై కాల్పులకు తెగబడ్డారని వివరించారు. దీంతో ఇరువర్గాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా రావల్సి ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed