కోజికోడ్‌లో షిగెల్లాతో ఒకరు మృతి

by Shamantha N |   ( Updated:2020-12-19 08:01:40.0  )
కోజికోడ్‌లో షిగెల్లాతో ఒకరు మృతి
X

కోజికోడ్: కేరళ రాష్ట్రం కోజికోడ్‌లో షిగెల్లా అనే అంటు వ్యాధి ప్రబలడంతో ఒక్కరు మృతిచెందారు. ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయని, మరో 20 మందికి కూడా సోకినట్లు అనుమానిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. గతవారం షిగెల్లా సోకడంతో చికిత్స పొందుతూ 11ఏండ్ల బాలుడు మృతిచెందినట్లు పేర్కొన్నారు. షిగెల్లా అనేది బ్యాక్టీరియా కుటుంబానికి చెందినది. ఈ అంటురోగం సోకిన వారికి డయేరియా, జ్వరం, కడుపునొప్పి లక్షణాలు ఉంటాయి. కొంత మందికి ఎలాంటి లక్షణాలు ఉండకపోవచ్చు. మూడు రోజులకు మించి డయేరియా, ఇతర లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. షెగెల్లా బ్యాక్టీరియా ముఖ్యంగా ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందుతుంది.

Advertisement

Next Story