గొల్లపల్లిలో వృద్ధుడు దుర్మరణం

by srinivas |
గొల్లపల్లిలో వృద్ధుడు దుర్మరణం
X

దిశ, అమరావతి బ్యూరో: రోడ్డు ప్రమాదం జరిగి ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గొల్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జల్లే బాలగురువయ్య అనే వృద్ధుడు అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story