బాలింత మృతి.. దళిత సంఘాల ఆందోళన

by Shyam |

దిశ,మహబూబ్ నగర్: వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని దళిత సంఘాలు మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జనరల్ హాస్పిటల్ ఎదటు బుధవారం ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసేంతవరకు ఆందోళన విరమించేది లేదని భీష్మించుకూర్చోవటంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కవిత(25)కు నొప్పులు రావటంతో గత నెల 26వ తేదీన హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ నెల 3వ తేదీన ఆమెకు సిజేరియన్ చేయటంతో ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం క్షిణిస్తూ వస్తోంది. పలుమార్లు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. అసలేం జరిగిందని కుటుంబీకులు నిలదీయగా ఆమెకు అన్నవాహిత తెగిందని చెప్పారు. దీంతో కుటుంబీకులు మెరుగైన చికిత్స కోసం స్థానిక ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. జిల్లా ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే కవిత చనిపోయినట్లు బంధువుల ఆరోపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తుండగా దళిత సంఘాలు అడ్డుకుని ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. న్యాయం చేసేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేయటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దళిత సంఘాల నేతలతో చర్చలు జరిపారు.

tags; Maternal death,With the negligence of doctors,Died Tuesday while receiving treatment,Concern of Dalit Unions

Advertisement

Next Story

Most Viewed