మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా.. అభిమానుల రక్తదానం

by Sridhar Babu |
మహేశ్ బాబు జన్మదినం సందర్భంగా.. అభిమానుల రక్తదానం
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: సినీ హీరో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆదివారం ఖ‌మ్మం ప‌ట్ట‌ణంలోని ఆయ‌న అభిమానులు స్థానిక ఎంబీ గార్డెన్స్ ఆవరణ‌లో కేక్ క‌ట్ చేసి సంబురాలు నిర్వ‌హించారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు సేన జిల్లా అధ్యక్షులు దేవభక్తుని కిషోర్ బాబు ఆధ్వర్యంలో జ‌రిగిన ఈ కార్యక్రమానికి సుడా చైర్మ‌న్ బ‌చ్చు విజ‌య్‌కుమార్ హాజ‌ర‌య్యారు. అనంతరం వారు మాట్లాడుతూ…

తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రక్తదానం చేయటం, ఇబందుల్లో ఉన్న సినీ థియేటర్ కార్మికులు, సిబ్బంది కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అంతేగాకుండా కళాకారులను గుర్తించి వారికి సత్కారాలు సన్మానాలు చేయటం జరిగిందన్నారు. అనంతరం డాక్ట‌ర్ కూరపాటి ప్రదీప్ డాక్ట‌ర్‌ రాజేష్ గార్గ్ ఆధ్వ‌ర్యంలో రక్తదానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. 150 మంది థియేటర్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందచేశారు. కళాకారులకు మెమోంటోలు షీల్డ్స్ అందచేశారు .

Advertisement

Next Story