భారత్‌లో మూడో ఒమిక్రాన్ కేసు

by vinod kumar |
omicron
X

దిశ, న్యూఢిల్లీ: భారత్‌లో మూడో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైంది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో గుర్తించినట్లు జామ్‌నగర్ అధికారులు తెలిపారు. గుజరాత్‌కు వచ్చిన 71 ఏళ్ల వ్యక్తిలో లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 2న భారత్‌కు రాగా, కొవిడ్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు. దీంతో బాధితుడి నమునాలను జినోమ్ సీక్వేన్సింగ్ కోసం పూణే వైరాలజీ కేంద్రానికి పంపించారు. గుజరాత్‌లోని బయోటెక్నాలజీ పరిశోధన కేంద్రం ఒమిక్రాన్ వేరియంట్ అని తేల్చింది. ఈ విషయాన్ని గుజరాత్ ఆరోగ్య కమిషనర్ జైప్రకాష్ శివారే నిర్ధారించారు. అయితే పూణె ల్యాబ్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. రెండు రోజుల క్రితమే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా ఒమిక్రాన్ వేరియంట్ కనుగొన్న తర్వాత దేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీకుల పరీక్షలతో పాటు నిఘాను భారత్ పెంచింది.

Advertisement

Next Story

Most Viewed