- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒమర్ అబ్దుల్లా కుటుంబం గృహ నిర్బంధం
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, ఎంపీ ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబాన్ని అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ విషయాన్ని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్‌లో వెల్లడిస్తూ నూతన జమ్ము కశ్మీర్‌లో పాలన ఇలాగే ఉంటుందా? అని ప్రశ్నించారు. ‘2019 ఆగస్టు తర్వాత కనిపిస్తున్న నూతన జమ్ము కశ్మీర్ ఇదే. ఎలాంటి వివరణ లేకుండా మమ్మల్ని ఇంటిలోనే నిర్బంధించారు. సిట్టింగ్ ఎంపీ, మా నాన్న ఫరూఖ్ అబ్దుల్లా, నన్ను ఇంటిలోనే బంధించారు. నా సోదరి, ఆమె పిల్లలనూ ఇంటిలోనే బంధించారు’ అని ఒమర్ ట్వీట్ చేశారు. ‘మీరు చెబుతున్న నూతన ప్రజాస్వామ్య నమూనాలో మమ్మల్ని నిర్బంధించడం, కనీసం ఇంటిలో పనిచేసేవాళ్లనీ అడ్డుకోవడమేనా? వీటన్నింటిని సహించలేక ఆగ్రహిస్తే తాము ఇంకా కోపగించుకుంటున్నారని ఆశ్చర్యపడటమే మీ ప్రజాస్వామిక నమూనానా?’ అని ప్రశ్నించారు. పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా తమను గృహ నిర్బంధించినట్టు పేర్కొన్నారు. ఒమర్ అబ్దుల్లా ట్వీట్లపై పోలీసులు స్పందిస్తూ పుల్వామా ఘటన జరిగి సరిగ్గా రెండేళ్లు గడిచిన సందర్భంగా వీవీఐపీల కదలికలపై ఆంక్షలు విధించినట్టు వివరించారు.