- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్ వాయిదా.. జపాన్‌పై పెను భారం ?
‘ఒలింపిక్స్ వాయిదా వేయడమంటే.. శనివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచును ఆదివారానికి వాయిదా వేయడం కాదు’ అని స్వయంగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ వ్యాఖ్యానించారు. ప్రతీ నాలుగేండ్లకోసారి వచ్చే ఈ మెగా స్పోర్ట్స్ ఈవెంట్‌ను వాయిదా వేయడమంటే నిర్వాహక కమిటీ, దేశం ఎంతో నష్టపోవాల్సి వస్తుంది. కేవలం సమయమే కాదు ఆర్థికంగా మరెంతో భారం మోయాల్సి ఉంటుంది. అందుకే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎంతో ఆచితూచి ఐవోసీ, టోక్యో 2020 కమిటీ వాయిదా నిర్ణయం తీసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ 2020 కోసం జపాన్ 12.6 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇది జపాన్ కరెన్సీలో 1.35 ట్రిలియన్ యన్స్‌కు సమానం. దీనిలో టోక్యో సిటీ బాడీ 597 బిలియన్ యన్స్, జపాన్ ఆర్గనైజింగ్ కమిటీ 603 యన్స్, జపాన్ కేంద్ర ప్రభుత్వం 150 బిలియన్ యన్స్ ఖర్చు పెడుతున్నాయి. 2019 చివరి నాటికే ఈ మొత్తం ఖర్చు చేశారు. ఇక మిగతా నిధులను స్పాన్సరర్ల నుంచి వసూలు చేశారు. ఇది దాదాపు 348 బిలియన్ యన్స్ వరకు ఉంటుందని సమాచారం. కాగా ఇప్పుడు ఒలంపిక్ క్రీడల వాయిదా వేయడం వల్ల ఖర్చు మరింతగా పెరిగిపోయే అవకాశం ఉంది.
అదనపు ఖర్చు గురించి టోక్యో 2020 ఒలింపిక్స్ సీఈవో తొషిరో మోటో స్పందిస్తూ.. ‘మేం ప్రధాన స్టేడియాన్ని ఒలింపిక్స్, పారా ఒలంపిక్స్ కోసం సెప్టెంబర్ చివరి వరకు లీజుకు తీసుకున్నాం. ఇప్పుడు ఆ లీజు చెల్లించడంతో పాటు వచ్చే ఏడాది కోసం మళ్లీ లీజు అద్దె చెల్లించాలని’ అన్నారు. ఇక ఆటగాళ్ల కోసం నిర్మించే అపార్ట్‌మెంట్లను సెప్టెంబర్ తర్వాత రియల్ ఎస్టేట్ కోసం ఇవ్వాల్సి ఉంది. వాటిని ఇప్పటికే అమ్మేశారు. ఇప్పుడు వచ్చే ఏడాది వరకు ఆ అపార్ట్‌మెంట్లను కొనుక్కున్న వాళ్లకు అందించకపోతే వాళ్లు నష్టపరిహారం కోరే అవకాశం కూడా ఉంది.
ఒలింపిక్స్ వాయిదా నిర్ణయం మంగళవారమే తీసుకున్నందున, ఇప్పుడే అన్ని కమిటీలను కలిసి ఆడిటింగ్ చేయడంతో పాటు అదనపు ఖర్చును లెక్కించాల్సి ఉందని తొషిరో మోటో చెప్పారు. ఇది కచ్చితంగా జపాన్ ఆర్థిక వ్యవస్థపై భారం మోపేదే. కానీ, ‘అనుకోకుండా వచ్చిన విపత్తును ఆపలేం కదా’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరి జపాన్ ఆ భారాన్ని ఎలా తట్టుకుంటుందనేదే వెయ్యి డాలర్ల ప్రశ్న.
tags: Olympics, Postponed, Crores of loss, Japan, Tokyo, CEO Toshiro Muto