ఒలంపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతిస్తాం: తొషిరో ముటో

by Shyam |
ఒలంపిక్స్‌కు ప్రేక్షకులను అనుమతిస్తాం: తొషిరో ముటో
X

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ నేపథ్యంలో ఈ ఏడాది జరగాల్సిన టోక్యో ఒలంపిక్స్ 2021కి వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా క్రీడలు తిరిగి ప్రారంభం అయినా ప్రేక్షకులను మాత్రం అనుమతించడం లేదు. దీంతో ఒలంపిక్స్‌లో ప్రేక్షకులకు అనుమతి ఉంటుందా లేదా అనే అనుమానాలు తలెత్తాయి. దీనిపై విశ్వ క్రీడల నిర్వాహక కమిటీ సీఈవో తొషిరో ముటో ఒక స్పష్టత ఇచ్చారు. బీబీతో మాట్లాడుతూ.. ‘ఒలంపిక్స్ నిర్వహణపైనే మా దృష్టంతా ఉంది. భౌతిక దూరం పాటిస్తూ పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని ఐసీసీ చీఫ్ థామస్ బాచ్ కూడా సూచించారు. మేం కూడా అదే ఆలోచనతో ఉన్నాం. దీనికి సంబంధించిన వ్యూహాలు తయారు చేస్తున్నాము. ప్రేక్షకులు సురక్షితంగా ఉండే ఏర్పాట్లు చేస్తాం’ అని తొషిరో మొటొ చెప్పారు. ఒలంపిక్స్ కోసం జపాన్‌కు వచ్చే ముందు అథ్లెట్లు, ఐవోసీ సభ్యులు తప్పకుండా కరోనా పరీక్షలు జరిపించుకోవాలని, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఒలంపిక్స్ జరుగుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed