- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్ : మనిషి తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీలేదని ఒక నానుడి ఉంది. అది ఎంతటి వయస్సులోనైనా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చేయొచ్చు అని ఇప్పటికే చాలా మంది రుజువు చేశారు. అందులోనూ భక్తి ఉందటే వారిని ఆపడం అసాధ్యం.. భక్తి అనేది మనిషిని ఎంతటి సాహసానికైనా ప్రేరేపిస్తుంది. దానికి ఈ ఘటనే మంచి ఉదాహరణ.
ఓ 68 ఏళ్ల వృద్ధురాలు దేవుడిని దర్శించుకోవాలనుకుంది. అందుకోసం సైకిల్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణించాలని సంకల్పించింది. అనుకున్నదే తడవుగా తన భక్తిని చాటుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ప్రయాణానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన ఓ 68 ఏళ్ల వృద్ధురాలు కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించేందుకు బయలుదేరారు. ఇందుకోసం ఆమె 2200 కిలోమీటర్ల యాత్రను సైకిల్‌పై చేపట్టింది. అయితే, మార్గం మధ్యలో ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి ఆమె యాత్రకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడమే కాకుండా, వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్‌గా మారింది. ఈ వయసులో భక్తితో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘ఆమె తన యాత్రను క్షేమంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు’ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.